కొన్ని సినిమాలు గుర్తుంటాయి.. కొన్ని పాత్రలు గుర్తుంటాయి. సినిమా గుర్తుంటే హిట్.. అదే పాత్ర గుర్తుంటే బంపర్ హిట్. కావాలంటే టాలీవుడ్‌లోనే కాదు మొత్తం ప్రపంచ సినిమానే ఓసారి రివైండ్ చేసుకోండి. ఎక్కడ పాత్ర హిట్ అయితే అక్కడ సినిమా కలకాలం గుర్తుండిపోతుంది. మరీ ఎక్కువ అనుకుంటే ఓ దశాబ్ద కాలం గుర్తుంటుంది. అలాంటి చాలా పాత్రల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) ఒకటి. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది.
రామ్ పోతినేని (Ram) – పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల విశాఖపట్నంలో జరిగింది. ఆగస్టు 15న విడుదల కావడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి.. ఈవెంట్‌కి రాదు. ఇక నిర్మాత ఛార్మి (Charmy Kaur) కూడా రాలేదు. ఈ నేపథ్యంలో సారీ మెసేజ్ కూడా పంపించారు పూరి. ఆ తర్వా రామ్ మాట్లాడుతూ ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా పుట్టాడో చెప్పాడు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి పాత్ర పోషించే అవకాశం ఎప్పుడోగానీ రాదని, ఆ అవకాశం తనకు వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 2018 డిసెంబరులో పూరి జగన్నాథ్‌ను గోవాలో కలిశా. ఎలాంటి సినిమా చేద్దాం అని ఆయన అంటే.. ఓ పదేళ్లపాటు గుర్తుండిపోయే పాత్ర క్రియేట్ చేయమని అడిగా. అలా ఆయన రాసిన పాత్రే ‘ఇస్మార్ట్ శంకర్’. సినిమాలో శంకర్ రోల్ ప్లే చేసేటప్పుడు భలే కిక్ వచ్చింది అని రామ్ అన్నాడు. సినిమా చేస్తున్నంతసేపు నేను ఎంత ఎంజాయ్ చేశానో, అందులో పది శాతం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే హ్యాపీ అని రామ్ అన్నాడు.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పూర్తయ్యాక ఈసారి ఆ సినిమాకు, ఆ పాత్రకు మించి ఉండాలి అని అడిగాను. అలా రాసిందే ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి తన కెరీర్‌లో ఎక్కువ సమయం తీసుకున్న స్క్రిప్ట్ ఇదేనేమో. ఆయనతో పని చేసేటప్పుడు కిక్ వస్తుంది. ఆయన స్క్రిప్టు వింటున్నప్పుడూ అంతే కిక్ వస్తుంది అన్నాడు రామ్. ఇక పూరి గురించి మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేంది పూరి జగన్నాథే. కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడం చిన్న విషయం కాదు. అందులో ఆయన దిట్ట అని కొనియాడాడు రామ్.