Rama Charan, Upasana: వెకేషన్ మూడ్ లో చిల్ అవుతున్న రామ్ చరణ్, ఉపాసన?

మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొంది వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్న రామ్ చరణ్ తన సినిమా షూటింగులకు విరామం ఇచ్చి తన భార్యతో కలిసి వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ దంపతుల పదవ పెళ్లి రోజు కూడా రావడంతో ఈ ఇద్దరు 10వ పెళ్లి రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం కోసం ఇటలీ వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఉండగా ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్తగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఈ విధంగా వీరిద్దరు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో జూన్ 14వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వీరిద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.ఈ క్రమంలోనే వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు కావడంతో ఈ అద్భుతమైన రోజును ఘనంగా జరుపుకోవడం కోసం ఈ జంట ఇటలీ వెళ్లారు.

ఇటలీ దేశంలోని ఎంతో ప్రఖ్యాత నగరాలలో ఒకటిగా పేరుగాంచిన మిలాన్ నగరంలో ఈ జంట ఎంతో ఆహ్లాదంగా తమ పెళ్లి వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా రామ్ చరణ్ ఉపాసన ప్రస్తుతం హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.10 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి రామ్ చరణ్ దంపతులకు పిల్లలు లేరు అనే ఒక అసంతృప్తి తప్ప వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.

ఇదివరకే పిల్లల గురించి ఉపాసన దగ్గర ప్రస్తావించగా ఇప్పుడు తాను ఈ విషయం గురించి ఏ సమాధానం చెప్పిన పెద్ద సెన్సేషన్ అవుతుందని సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతానని ఈ ప్రశ్నను దాటవేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus