‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మే 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
వీకెండ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ మూవీ వీక్ డేస్ లో కూడా రాణించలేకపోతుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.04 cr |
సీడెడ్ | 0.47 cr |
ఉత్తరాంధ్ర | 0.39 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.17 cr |
గుంటూరు | 0.23 cr |
కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.12 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.97 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 cr |
ఓవర్సీస్ | 0.10 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.17 cr (షేర్) |
‘రామబాణం’ (Ramabanam) చిత్రానికి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.12.33 కోట్ల షేర్ ను రాబట్టాలి.
బ్యాడ్ టాక్ వల్ల ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అయితే కష్టమే. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఏమైనా కొంత రాబట్టుకుని డీసెంట్ షేర్స్ ను నమోదు చేస్తుందేమో చూడాలి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?