Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..!

వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..!

  • November 25, 2022 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..!

సోషల్ మీడియాలో పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువై పోయింది. సామాజిక మాధ్యమాలు సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దూరాన్ని తగ్గించేశాయి కానీ విమర్శలకు కూడా కారణమవుతున్నాయి. ఇప్పటికే నెటిజన్లు ఎంతోమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. ఫ్యాన్ వార్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. రీసెంట్‌గా రామజోగయ్య శాస్త్రిని టార్గెట్ చేశారు నెటిజన్లు.. బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘వీర సింహా రెడ్డి’ చిత్రంలో శాస్త్రి రాసిన ‘జై బాలయ్య’ సాంగ్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

దీంతో ఆయనపై కొందరు చేసిన కామెంట్స్ విషయంలో శాస్త్రి బాగా ఫీల్ అయ్యారు. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.. చేసే ప్రతి సినిమాలోనూ.. రాసే ప్రతి పాటలోనూ.. పలికే ప్రతి పదంలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.. ఇక ‘జై బాలయ్య’ పాట విషయానికొస్తే..

Ramajogayya Sastry speech

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ ట్యూన్ కాపీ కొట్టాడని ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మ’ లా ఉందని కొందరు.. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ పాటలా ఉందని కొందరు అంటున్నారు. ఆ లిరిక్స్ ఏంటి అంటూ శాస్త్రిపై కామెంట్స్ చేశారు. కొందరు ఏకంగా ఆయన పేరు ముందు ఉండే ‘సరస్వతీ పుత్ర’ బిరుదు లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన నొచ్చుకున్నారు. అలాంటి వారికి తన స్టైల్లో సున్నితంగా సమాధానం చెప్పారు.

‘‘ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను.. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి’’ అంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘సంగీత జ్ఞానం లేని మూర్ఖులు ఎవరో ఏదో వాగారని.. మీరు ఫీల్ అవకండి గురువు గారూ’’ అంటూ సినీ, సంగీత ప్రియులు, బాలయ్య అభిమానులు శాస్త్రికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..
అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను
సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..
ఉంటే ఇటు రాకండి

— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichandh Malineni
  • #Nandamuri Balakrishna
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar
  • #Veera Simha Reddy

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

4 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

5 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

7 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

7 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

6 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

8 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

9 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

9 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version