ఒకప్పుడు కమెడియన్ గా ‘భీమిలి కబడ్డీ జట్టు’ (Bheemili Kabaddi Jattu) ‘పిల్ల జమిందార్’ (Pilla Zamindar) ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు ధనరాజ్ (Dhanraj). ఇలాంటి టైంలో ‘జబర్దస్త్’ కామెడీ షో ఇతన్ని ఆడుకుంది. అందులో టీం లీడర్ కొన్నాళ్ల పాటు ఇతని స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కమెడియన్ గా ధనరాజ్ కి తిరుగులేదు. చాలా సినిమాల్లో తన మార్క్ కామెడీతో ఆ విషయాన్ని ప్రూవ్ చేశాడు.
మరో ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు (Venu Yeldandi) ‘బలగం’ (Balagam) తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. వేణులో అంత మేటర్ ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు. సో ‘జబర్దస్త్’ వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని ఆ సినిమాతో ప్రూవ్ అయ్యింది. అందుకే ధనరాజ్ కూడా దర్శకుడిగా మారి ‘రామం రాఘవం’ (Ramam Raghavam) అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ‘రామం రాఘవం’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ థియేటర్లలో జనాలు లేరు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. టాక్ బాగా వచ్చింది కాబట్టి.. ఇలాంటి సినిమాలు శాటిలైట్, ఓటీటీ రైట్స్ తో గట్టెక్కేసే అవకాశం ఉండాలి. కానీ ఈ సినిమాకి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ‘రామం రాఘవం’ కోసం ఏకంగా రూ.6.5 కోట్ల బడ్జెట్ అయ్యిందట.
సముద్రఖని (Samuthirakani) బిజీ ఆర్టిస్ట్. అతని కాల్షీట్లు అనుకున్న టైంలో అడ్జస్ట్ కాకపోవడం వంటి ఇతర కారణాల వల్ల.. పలుమార్లు షూట్ క్యాన్సిల్ అవ్వడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయినట్టు స్పష్టమవుతుంది. ఇక బిజినెస్ పరంగా రూ.4 కోట్లకి మించి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ సేల్ అయ్యేలా కనిపించడం లేదని వినికిడి.