కొన్ని గొంతులు ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రోజుల తర్వాత విన్నా కొత్తగా ఉంటాయి. ఆ గొంతులో మ్యాజిక్ ఇది. అలాంటి మ్యాజిక్ ఉన్న గాయకుల్లో రమణ గోగుల (Ramana Gogula) ఒకరు. స్వతహాగా సంగీత దర్శకుడు అయిన ఆయన అప్పుడప్పుడు గొంతు సవరిస్తుంటారు కూడా. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ‘గోదారి గట్టు మీద..’ అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలో పాడారు. పాటతోనే సరిపెట్టేయాలని అనుకోవడం లేదు. తిరిగి తన మ్యూజిక్ మ్యాజిక్ వినిపించడానికి సిద్ధమయ్యారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో రమణ గోగుల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆ పాట గురించి, తన జర్నీ గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పుకొచ్చారు. ఇంతవరకు సొంత సినిమాల్లో పాడాను తప్ప, వేరే సంగీతంలోనూ పాడలేదని.. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) , సంగీత దర్శకుడు భీమ్స్ (Bheems Ceciroleo) అడిగితే కాదనలేకపోయానని చెప్పుకొచ్చారు. తన తొలి సినిమా ‘ప్రేమంటే ఇదేరా’ (Premante Idera) అని, వెంకటేశ్ (Venkatesh) సినిమాతో కెరీర్ ప్రారంభిచినట్లు..
రీస్టార్ట్ కూడా ఆయన పాటతోనే చేస్తున్నా అని చెప్పారు. ఇక పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ అమెరికాలో ఏఐ, డాటా ఎనలిటిక్స్ ప్రాజెక్ట్స్ కంపెనీలో పని చేస్తున్నానని తెలిపారు. మళ్లీ సంగీత దర్శకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దానికి అన్నీ కుదరాలి అని అన్నారు. నటులు, దర్శకులు, కథ కుదిరినప్పుడు మరోసారి సంగీత దర్శకత్వం చేస్తా అని చెప్పేశారు. ఇక పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి మాట్లాడుతూ.. తన సంగీత ప్రయాణంలో పవన్ కల్యాణ్‌తో ప్రయాణం ప్రత్యేకమని చెప్పారు.
ఆయన క్రియేటివ్ ఆలోచనలున్న వ్యక్తి అని, ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారని చెప్పారు. తెలుగు సినిమాలో తొలిసారిగా ఇంగ్లిష్ పాట ఆయన సినిమా కోసమే కంపోజ్ చేశా అని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆ పాట విన్న వెంటనే మనం సినిమాలో తీసుకుంటున్నాం అని చెప్పారని నాటి విషయాన్ని చెప్పారు రమణ గోగుల. అలాగే పవన్ గొప్ప స్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది అని కూడా చెప్పారు.