రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్ లో తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గతేడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఖిలాడీ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. అయితే రవితేజ సైతం ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ప్రేక్షకులు సైతం హిట్ టాక్ వస్తే మాత్రమే సినిమాలను చూడాలని భావిస్తున్నారు. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రేక్షకులు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. చిన్న సినిమాలకు మాత్రం హిట్ టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో రామారావు ఆన్ డ్యూటీ బుకింగ్స్ బాగానే ఉన్నా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.
వైజాగ్ లో జగదాంబ, శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ మెలోడీ థియేటర్లలో బుకింగ్స్ బాగానే ఉన్నా మిగతా థియేటర్లలో బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. కర్నూలులో కూడా రామారావు ఆన్ డ్యూటీ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. విజయవాడలో స్వర్ణ మల్టీప్లెక్స్ లో మాత్రమే ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫస్ట్ డే బుకింగ్స్ బుకింగ్స్ ఉన్నాయి. ఈ సినిమాకు పోటీగా విక్రాంత్ రోణ మూవీ థియేటర్లలో విడుదలవుతోంది.
రామారావు ఆన్ డ్యూటీ థియేట్రికల్ హక్కులు 17 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. రవితేజ సినిమాకు ఇంత తక్కువగా బిజినెస్ జరగడం చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి. అయితే హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ఫుల్ రన్ లో 35 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.