Ramya Krishna: వైరల్ అవుతున్న రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగమార్తాండ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కృష్ణవంశీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రమ్యకృష్ణ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రంగమార్తాండ సినిమా ప్రారంభానికి ముందు ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

రంగమార్తాండ మాతృక నటసామ్రాట్ ను నేను చూశానని ఆమె కామెంట్లు చేశారు. ఇలాంటి సీరియస్ సినిమాను రీమేక్ చేస్తే ఎవరు చూస్తారని అడిగానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ఆయన మాత్రం నా మాటలు వినకుండా షూట్ మొదలుపెట్టారని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం కృష్ణవంశీ పలువురు హీరోయిన్లను సంప్రదించగా వాళ్లు ఎవరూ సెలెక్ట్ కాకపోవడంతో నేను చేస్తానని చెప్పానని రమ్యకృష్ణ అన్నారు.

కళ్లతోనే నటించాలని కృష్ణవంశీ నాకు చెప్పారని నేను ఎమోషనల్ సినిమాలను ఎక్కువగా చూడనని రమ్యకృష్ణ వెల్లడించారు. రంగమార్తాండ సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి రివ్యూలు వస్తాయో చూడాల్సి ఉంది. ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కానుండగా ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని బోగట్టా. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

ఉగాది కానుకగా రిలీజవుతున్న ఈ సినిమా బాక్సఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రంగమార్తాండ సినిమా ఫలితంపై ఎంతోమంది సినీ కెరీర్ ఆధారపడి ఉంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తుండగా ఆ ప్రచారం ఈ సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus