Ramya Krishna: ఇప్పటి హీరోయిన్ల గురించి రమ్యకృష్ణ ఊహించని కామెంట్స్!

సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.మొదట సహాయనటి పాత్రలు పోషించిన ఆమె తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ వెంటనే ఈమె సక్సెస్ కాలేకపోయింది. కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు గారు’ సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ కూడా విలక్షణమైన నటనతో స్టార్ హీరోయిన్ల మాదిరి బిజీగా గడుపుతోంది రమ్యకృష్ణ.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో ఇప్పటి హీరోయిన్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు మాలాగా 20-25 ఏళ్ల వరకు కెరీర్ ను రమ్యకృష్ణ మాట్లాడుతూ.. “కొనసాగించలేకపోతున్నారు అనేది నిజం.దానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప్పట్లో మాకు తప్పులు చేయడానికి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చేవి.

కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సక్సెస్ ఉంటే.. వరుసగా 4 , 5 ఛాన్సులు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలు హిట్ అవుతాయా లేదా అన్నది తర్వాతి సంగతి. వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితుల్లో హీరోయిన్లు లేరు. మేము ఏళ్ళు కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వాళ్ళు ఇప్పుడు తక్కువ టైంలోనే సంపాదిస్తున్నారు. టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. లైఫ్ లో ఏదీ శాశ్వతం కాదు. ఉన్నదాంట్లోనే అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus