Ramya Krishna: నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఆప్షన్ రమ్యకృష్ణ కాదట.. ఆ సాఫ్ట్ హీరోయిన్..!

ప్రీ ప్రొడక్షన్ టైములో నటీనటులను ఎంపిక చేసుకునే సమయంలో దర్శకుల మైండ్ లోకి చాలా మంది నటీనటులు వస్తారు. అందరినీ సంప్రదించి డేట్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే అతను అనుకున్న నటీనటులు దొరక్కపోతే దొరికిన వాళ్ళతోనే అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. అదే పలనా నటీనటులనే దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాసుకుంటే అప్పుడు మరింత కష్టమైపోతుంది.ఇదిలా ఉండగా.. నిన్నటితరం స్టార్ హీరోయిన్ మీనా అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈమెను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మంచి మంచి పాత్రలు రాసుకున్నారు. కానీ మీనా తల్లి వల్ల ఆ పాత్రల్ని వదులుకోవాల్సి వచ్చిందట. ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాలో టబు పాత్ర కోసం ముందుగా మీనానే అనుకున్నాడట దర్శకుడు కృష్ణవంశీ. కానీ మీనా తల్లి వల్ల ఆ అఫర్ ను వదులుకోవాల్సి వచ్చిందట. అలాగే రజినీకాంత్ నటించిన ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి కూడా మొదట మీనానే అనుకున్నారట.

ఇది కూడా మీనా తన తల్లి వల్ల మిస్ చేసుకుందట. అప్పట్లో మీనా తన తల్లి ఏం చెబితే అదే వినేదట. ఆమె ఓకే చెప్పిన నిర్మాతలకే మీనా డేట్స్ ఇచ్చేదట. మీనాకి ఇష్టం లేకపోయినా కూడా తల్లి మాటకి కట్టుబడి ఉండేదట. ఏది ఏమైనా నీలాంబరి పాత్రకి రమ్యకృష్ణ వందకి వంద శాతం న్యాయం చేసింది. మీనా సాఫ్ట్ హీరోయిన్ కాబట్టి ఆ పాత్ర ఆమెకి సెట్ అయ్యేది కాదేమో..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus