ఓటీటీలో రానా – చైతు అదరగొడతారా.. అయితే ఇక్కడో మెలిక!

  • March 23, 2023 / 01:10 PM IST

బావాబామ్మర్దులు రానా – నాగచైతన్య కలసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. వామ్మో రానా వెబ్‌ సిరీసా? వామ్మో నాగచైతన్య వెబ్‌ సిరీసా? అంటారా? ఆగండాగండి ఇద్దరూ ఇప్పుడు చేస్తున్నది నిర్మాతలుగా మాత్రమే. హమ్మయ్య.. నిర్మాతలగానేనా అంటారా? అవును. ఇద్దరూ ఓ కలసి వెబ్ సిరీస్‌ చేస్తుండటం కూడా కాదు. చేసేశారు. దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్య కలసి ఓ ప్రొడక్షన్ హౌజ్ పెట్టారట. ఎవరికీ తెలియకుండా ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేశారట.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. మాయాబజార్ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను తమ కొత్త బ్యానర్‌లో నిర్మించారట రానా – నాగచైతన్య. షూటింగ్ పూర్తయిన ఈ సిరీస్‌ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉందట. అయితే ఈ సిరీస్‌ ఏ ఓటీటీకి ఇస్తున్నారు అనే వివరాలు బయటికి రాలేదు కానీ ఓ సంస్థతో అయితే ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం. అయితే ఈ సిరీస్‌లో రానా, చైతు కనిపించరు.

కేవలం కంటెంట్ ప్రొడ్యూసర్స్ మాత్రమే. త్వరలోనే వివరాలు బయటకు వస్తాయి అని చెబుతున్నారు. రానా ఇప్పటికే వెబ్ సిరీస్‌లో ఓటీటీకి పరిచయం, చైతన్య ‘ధూత’ అనే సిరీస్ చేశాడు. అయితే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రానా చేసిన ‘రానా నాయుడు’ ఎంత రచ్చ చేస్తోందా అందరికీ తెలిసిన విషయమే. నందమూరి బాలకృష్ణ చెప్పినట్లు బూతుల పండగలా ఉంది ఆ వెబ్‌సిరీస్‌. వెంకటేశ్‌ను అలాంటి ఓ క్యారెక్టర్‌లో చూడలేక, ఆయనతో సీన్స్‌లో రానాను అలా చూడలేక ఫ్యాన్స్‌ క్షోభ పడ్డారు అని చెప్పొచ్చు.

మరోవైపు చైతు చేసిన ‘ధూత’ సిరీస్‌ ఎప్పుడొస్తుంది అనే విషయం తెలియడం లేదు. దీంతో వాళ్లిద్దరి ఫ్యాన్స్‌ వెబ్‌సిరీస్‌ అనే పేరు వినిపిస్తే చాలు భయపడుతున్నారు. మంచి సినిమాలు చేసుకోక వెబ్‌సిరీస్‌ల్లోకి వెళ్లి ఇబ్బందిపడటం ఎందుకు అని కూడా అనుకుంటున్నారు. అయితే మరి ఈ ‘మాయా బజార్‌’ ఎప్పుడొస్తుందో, ఎలా ఉంటుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus