Rana: హీరోయిన్లతో రిలేషన్ పై రానా షాకింగ్ కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా రానా గెస్ట్ గా హాజరైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఎపిసోడ్ నిన్నటినుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 22 సంవత్సరాల వయస్సులో వ్యాపారం ఎలా చేయాలో తెలియలేదని ఆ సమయంలో కెరీర్ లో ఒడిదొడుకులు చూశానని రానా అన్నారు. ఆ తర్వాత గేమింగ్ చేశానని చిల్లీ పౌడర్ ప్లాంట్ కూడా పెట్టానని తర్వాత సినిమాలే కరెక్ట్ అని భావించానని రానా వెల్లడించారు.

బాలయ్య ఏ ఫీల్డ్ లోకి వెళ్లినా నాకంటే ముందు రానా కనిపిస్తాడని చెప్పగా తాను కొత్తదనాన్ని ఇష్టపడతానని రానా తెలిపారు. పదేళ్లుగా రానా హీరోయిన్లతో లవ్ లో ఉన్నాడని వార్తలు విన్నానని కానీ రానా బయటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడని ఈ ట్విస్ట్ ఏంటని బాలయ్య రానాను అడిగారు. రానా ఇండస్ట్రీ నుంచి అది వర్కౌట్ కాలేదని చెప్పారు. నేను పెళ్లి చేసుకుంటానని చెబితే ఇంట్లో వాళ్లు షాక్ అయ్యారని రానా చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ రానాను ఎంతమందిని రిజెక్ట్ చేశావని అడిగారు. రిజెక్ట్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారని రానా అన్నారు. బాలయ్య ఇంట్లో ఆర్గ్యుమెంట్ ను తానే మొదలుపెడతానని తానే మొదట సారీ చెబుతానని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ప్రేమంటే ఎంత స్వచ్ఛమైనదో, ఎంత నిర్మలమైనదో తన భార్యకు మాత్రమే తెలుసని కామెంట్లు చేశారు. రానా మాట్లాడుతూ పెళ్లి తర్వాత భార్యకు ఐ లవ్ యూ చెప్పలేదని అన్నారు. నా కన్నా భార్య ఎక్కువగా పార్టీలు చేస్తుందని రానా వెల్లడించారు.

తన భార్యకు షూటింగ్ అన్నా షూటింగ్ లైఫ్ స్టైల్ అన్నా తెలియదని రానా అన్నారు. భార్య ఫోన్ ను చెక్ చేస్తుంటే కంగారు పడకుండా ఉండే ధైర్యం ఉందా అనే ప్రశ్నకు ఉందని రానా బదులిచ్చారు. బాలయ్య సురేష్ బాబుకు కాల్ చేయగా సురేష్ బాబు రానా సెల్ఫ్ మేడ్ సన్ అని కామెంట్లు చేశారు. బాలయ్య రానా ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus