మిహికాను పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ నమ్మలేదు!

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో ఉన్న బ్యాచిలర్ హీరోలంతా పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్ట్ లో హీరో రానా కూడా ఉన్నారు. తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి.. తను ప్రేమించిన మిహీకా బజాజ్ ను పెళ్లాడారు రానా. అయితే తాను మిహికాను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదని.. అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. రానా హోస్ట్ చేస్తోన్న నెం.1.యారి ప్రోగ్రాం సీజన్ 3 మార్చి 14 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రానా..

షోకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు. మిహీకాతో పెళ్లి గురించి ముందుగా ఎవరితో షేర్ చేసుకున్నారని రానాని ప్రశ్నించగా.. ముందుగా తన తల్లితో చెప్పానని.. మిహికాను పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. ఆమె తనను సీరియస్ గా తీసుకోలేదని.. లాక్ డౌన్ లో పెళ్లి అంటున్నాడేంటి అనుకుందని అన్నారు. ఆ తరువాత తన తండ్రితో చెప్పగా.. ఆయన కూడా షాక్ అయ్యారని.. అసలు ఇది నిజమా కాదా అని అనుకున్నారని చెప్పారు.

కానీ ఆ తరువాత నాగచైతన్యకి చెప్పగా.. బెస్ట్ డెసిషన్ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పుకొచ్చారు రానా. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ హీరో నటించిన ‘అరణ్య’ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే ఈ సినిమా విడుదలైన నెల రోజుల గ్యాప్ లో ‘విరాట పర్వం’ అనే మరో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడు. ప్రస్తుతం రానా.. పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు.

రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus