బిగ్ బ్రేకింగ్ : రానా, మిహీకాల ఎంగేజ్మెంట్ ఈరోజే..!

తాత ఇండియాలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరుగా క్రేజ్ సంపాదించుకున్నారు. నాన్న పెద్ద స్టార్ ప్రొడ్యూసర్, బాబాయ్ కూడా స్టార్ హీరో..! అయినా కూడా ఎప్పుడూ స్టార్ ఇమేజ్ కోసం తపించి సినిమాలు చెయ్యలేదు మన రానా. అయినా సరే ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు.ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే వస్తున్నాడు.పొడుగ్గా ఉన్నాను కదా నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉండే కమర్షియల్ సినిమాలు చేసేసి సేఫ్ గేమ్ ఆడాలి అని ఎప్పుడూ అనుకోడు. అందుకే రానాకి కూడా ఎంతో మంది లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక యువ హీరోలంతా పెళ్ళిళ్ళ చేసుకోవాడానికి మక్కువ చూపుతున్న తరుణంలో రానా కూడా ఓ మిహీకా బజాజ్ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లోపే పెళ్ళి ఉంటుందని రానా తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన సురేష్ బాబు కూడా వెల్లడించాడు. ఇందులో భాగంగా.. ఈరోజు నిశ్చితార్ధం జరపడానికి రెడీ అయ్యారట. రామానాయుడు స్టూడియోస్ లో ఈరోజు కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరుగనున్నట్టు సమాచారం.

ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అందుకే ఈ దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఈ నిశ్చితార్ధ వేడుక జరుగనుందని తెలుస్తుంది. టాలీవుడ్ నుండీ రాంచరణ్, సందీప్ కిషన్, నాగ చైతన్య,సమంత, లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున, అఖిల్ వంటి వారు ఈ వేడుకకి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus