ఈసారి ఐఫా అవార్డ్స్ ను టాలీవుడ్ హీరోలైన రానా దగ్గుబాటి (Rana Daggubati) , తేజ సజ్జా (Teja Sajja) ..లు హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హోస్ట్..లు ఆధ్యంతం అక్కడి జనాలను ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రానా, తేజ సజ్జా.. తమ స్టైల్లో కామెడీ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో వారు కొన్ని పెద్ద సినిమాలపై వేసిన జోకులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసాయి. రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్'(Game changer) , మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలపై వాళ్ళు వేసిన జోకులు..
Rana, Sajja
ఆ హీరోల అభిమానులను హర్ట్ చేశాయి. దీంతో వాళ్ళు తేజ సజ్జ, రానా..లని ట్రోల్ చేయడం జరిగింది. ఈ ట్రోలింగ్ పై అటు రానా, ఇటు తేజ సజ్జ.. ఇద్దరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రానా తన టాక్ ప్రమోషన్లో భాగంగా ఐఫా కాంట్రోవర్సీపై స్పందించడం జరిగింది. ‘అవి జస్ట్ జోక్స్ అని అక్కడి సెలబ్రిటీలు అందరికీ తెలుసు. కానీ సోషల్ మీడియాలో ఎందుకు అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యారో అర్థం కాదు.
సినిమాల్లో గ్రాఫిక్స్ వాడినట్టు CGI అని డిస్క్లైమర్ వేస్తుంటారు. అలాగే ఇలాంటి షోలలో జోకులు వేస్తున్నప్పుడు కూడా కింద ‘ఇది జోక్’ అని డిస్క్లైమర్ వేయాలేమో’ అంటూ రానా క్లారిటీ ఇచ్చాడు. ఇక ‘రోటీ కాపాడా రొమాన్స్’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన తేజ సజ్జని కూడా యాంకర్ గీతా భగత్ ఐఫా కాంట్రోవర్సీపై ప్రశ్నించింది.
అందుకు తేజ.. ‘అదొక పెద్ద అవార్డు ఫంక్షన్. అక్కడికి అన్ని భాషల్లోని సినిమా వాళ్ళు వస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేశారు. ఆ స్క్రిప్ట్ పై చాలా మంది పని చేశారు. వాళ్ళందరి చేతులు దాటుకుని మా వరకు వచ్చాయి పేపర్స్. ఆ ఈవెంట్ ఫుల్ వీడియో చూస్తే ఎవ్వరికీ కూడా మేము తప్పుగా మాట్లాడాము అని అనిపించదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.