టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో రానా ఒకరనే విషయం తెలిసిందే. రానా నటించిన విరాటపర్వం త్వరలో రిలీజ్ కానుండగా పవన్ తో రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా రానా నెపోటిజం గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. నెపోటిజం అనేది సినిమాలకు సంబంధించినది కాదని రానా అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, రాజకీయాలకు నెపోటిజం సంబంధించినదని రానా చెప్పుకొచ్చారు.
సినిమా అనేది కళలకు సంబంధించినదని కళలకు బ్యాక్ గ్రౌండ్, ఫ్యామిలీతో సంబంధం ఉండదని రానా తెలిపారు. ప్రతిభ ఉండటం, ఆ ప్రతిభను వినియోగించుకోవడాన్ని బట్టి మాత్రమే ఈ ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తాయని రానా చెప్పుకొచ్చారు. ప్రతిభను ఎవరూ అడ్డుకోవడం సాధ్యం కాదని రానా వెల్లడించడం గమనార్హం. విరాటపర్వం నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సాయిపల్లవి నటించగా నందితా దాస్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.
మరోవైపు భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రానా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రానాకు జోడీగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రానా ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు రావడంతో సినిమాసినిమాకు క్రేజ్ పెరిగేలా రానా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!