Rana Daggubati: దేవకట్టా దర్శకత్వంలో రానా..!

దగ్గుబాటి రానా చివరిగా ‘విరాటపర్వం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం రానా నటించిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది. ఇందులో రానాతో పాటు వెంకటేష్ కూడా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో పలు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పుడు రానా మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకుడు దేవ కట్టా తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రాజకీయాలు, సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న దర్శకుడు దేవ కట్టా. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా ‘రిపబ్లిక్’. సాయిధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాకి మంచి పేరొచ్చింది.

ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలు వచ్చాయి. కానీ ఆశించిన రేంజ్ కి సినిమా వెళ్లలేకపోయింది. అందుకే కాస్త సమయం తీసుకొని.. కథలను సిద్ధం చేశారు దేవ కట్టా. ఆయన రాసుకున్న రెండు, మూడు స్క్రిప్ట్స్ లో ఒక వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. ఇదివరకు ఆయన ‘ఇంద్ర ప్రస్థ’ అనే పొలిటికల్ వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశారు.

కానీ అది హోల్డ్ లో పడింది. ఇప్పుడు రానా ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ తీయడానికి రెడీ అయ్యారు. మరి ఇది ‘ఇంద్ర ప్రస్థ’ కథో లేక కొత్త కథనో అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ఈ సిరీస్ లో రానాతో పాటు ఆది పినిశెట్టి కూడా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అది పూర్తయిన తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus