ఆ సినిమాలో నన్ను చాలా ప్రభావితం చేశాయి.. రణబీర్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన నటించిన బ్రహ్మస్త సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణబీర్ కపూర్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా

రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా బ్రహ్మాస్త్ర సినిమాకు గాను అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఓ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈయన అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి మాట్లాడారు.ఈ క్రమంలోనే గత ఏడాది తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ…గత ఏడాది విడుదలైనటువంటి పుష్ప, గంగుబాయి కతీయవాడి, RRR సినిమాలు తనకు ఒక నటుడిగా మాత్రమే కాకుండా, ప్రేక్షకుడిగా కూడా తనని ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు.

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించిన పుష్పరాజ్ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. తనకు కూడా అలాంటి పుష్పరాజ్ పాత్రలో నటించాలని కోరిక ఉంది అంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ తెలియజేశారు. ఇకపోతే గతంలో ఈయన పాకిస్తానీ సినిమాలలో నటిస్తారా అనే ప్రశ్నకు తాను సినిమాకు భాష లేదని మంచి పాత్ర దొరికితే నటిస్తానని తెలిపారు. ఇలా ఈయన పాకిస్తానీ సినిమాలలో నటిస్తానని తెలియజేయడంతో కొందరు రణబీర్ కపూర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై రణబీర్ కపూర్ మాట్లాడుతూ తాను అప్పుడు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఎక్కువగా పాకిస్తాన్ కి చెందిన నటీనటులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచి కథలు దొరికితే పాకిస్తాన్ సినిమాలలో నటిస్తారా అని అడిగినప్పుడు తప్పకుండా నటిస్తానని సమాధానం చెప్పాను, సినిమాకు కలకు ఎలాంటి హద్దులు ఉండవు అంటూ ఈ సందర్భంగా మరోసారి ఆయన క్లారిటీ ఇచ్చారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus