టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో విడుదల కాకుండానే ఎక్కువగా చర్చించకున్న సినిమా ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా ‘రంగమార్తాండ’ అనే చెప్పాలి. నటులు – వారి జీవితం అనే కాన్సెప్ట్‌లో సాగే ఈ సినిమా గురించి చాలామంది గొప్పగా మాట్లాడారు. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, కృష్ణవంశీ అంటూ చాలా మంచి ప్రశంసలే వచ్చాయి. అయితే ఆశించిన వసూళ్లు వచ్చాయా అంటే ఏమో అని అనాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అవును మీరు చదివింది కరెక్ట్.. సినిమా వచ్చేసింది.
ఆరేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తమ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేశారు ఈ చిత్రంతో. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి పేరొచ్చింది అని చెప్పాలి. మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ షాక్ ఇస్తూ.. సినిమా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఎలాంటి ప్రచారం లేకుండా అమెజాన్ ప్రైమ్ వేదికగా శుక్రవారం నుండి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
థియేటర్లలో వచ్చినప్పుడు కూడా ఈ సినిమాకు సరైన ప్రచారం చేయలేదు, కేవలం మౌత్ టాక్ మీదే ఆధార పడ్డారు అనే అపవాదు ఉంది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. రంగస్థలంపై ఎన్నో పాత్రలకి జీవం పోసి రక్తి కట్టించిన నటుడు రాఘవరావు (ప్రకాశ్‌రాజ్)కు రంగమార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయన స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం) కూడా రంగస్థల నటుడే. ఇద్దరూ కలిసి దేశ విదేశాల్లో ప్రదర్శనలతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నవారు.
రంగమార్తాండ (Rangamarthanda) బిరుదుతో తనని సత్కరించిన వేదికపైనే నాటక రంగం నుండి నిష్క్రమించిన రాఘవరావు.. తను సంపాదించిందంతా వారసులకి కట్టబెడతాడు. అక్కడి నుండి ఆయన జీవితంలో కొత్త అంకం మొదలవుతుంది. అందులో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. రంగస్థలంపై పోషించిన ప్రతిపాత్రనీ రక్తి కట్టించిన రాఘవరావు నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. జీవిత నాటకంలో గెలిచాడా లేదా? అనేదే కథ.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?