ఇటీవల ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఎంతో కాలంగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూసారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోవడంతో పాటు నెక్స్ట్ ఏ సినిమాలు ఓటిటిలో విడుదలవుతాయి అని డిస్కస్ చేసుకున్నారు. ఇటీవల ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించేసారు ఆ చిత్రం దర్శకనిర్మాతలు. ఇదే లిస్ట్ లో నితిన్ ‘రంగ్ దే’ సినిమా పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది.
అయితే ఈ చిత్రాన్ని కూడా ఓటిటిలో విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఈ చిత్రం ఓటిటిలోనే విడుదలవుతున్నప్పటికీ ప్రేక్షకులు టికెట్ పెట్టుకునే చూడాలట. ‘రంగ్ దే’ ఎక్కువ శాతం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. అయితే అందులో ‘పే పెర్ వ్యూ’ చొప్పున ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాల్సి వస్తుందట. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ ఉన్నవారు కూడా ఈ చిత్రాన్ని టికెట్ పెట్టుకునే చూడాలట.
అయితే వారికి టికెట్ రేటు తక్కువగా ఉంటుందట. మెంబెర్షిప్ లేని వాళ్ళు అయితే కనుక ఎక్కువ టికెట్ రేటు పెట్టుకుని చూడాల్సి వస్తుందట. నిజానికి ‘వి’ చిత్రానికే ఈ స్ట్రాటజీ అప్లై చెయ్యాలి అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అలా చెయ్యలేదు. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కు కూడా ఈ స్ట్రాటజీ ఉపయోగించడం లేదని కూడా తెలుస్తుంది. నితిన్ ‘రంగ్ దే’ చిత్రం నుండే ఈ స్ట్రాటెజీ అమలుపరుస్తారని టాక్.