Mega Heroes: ముగ్గురూ మాటలతో అదరగొట్టేశారు.. ఏం చెప్పారో చూశారా?

ర్యాపిడ్ ఫైర్‌లయందు యాంకర్‌ సుమ అడిగే ర్యాపిడ్‌ ఫైర్‌ వేరయా! అంటుంటారు. ఎందుకంటే ఆమె ప్రశ్నలు అంత తికమకగా, సరదాగా ఉంటాయి. ఏదో ఒకటి చెప్పేస్తే స్పాంటేనియస్‌ పంచ్‌లు పడిపోతాయి. అలాంటి సుమ ర్యాపిడ్‌ ఫైర్‌ను ఎదుర్కొన్నారు మెగా హీరోలు వరుణ్‌ తేజ్, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌. ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఈ ర్యాపిడ్‌ ఫైర్‌ జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రశ్నలు, సమాధానాలు వైరల్‌గా మారాయి.

* మీ ముగ్గురిలో సోషల్‌ మీడియా ఎక్కువగా వాడేది ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: నేను

* ముగ్గురిలో ఎక్కువగా అబద్ధాలు చెప్పేదెవరు?

వరుణ్‌తేజ్‌: సాయిధరమ్‌ తేజ్‌ అస్సలు అబద్దాలు చెప్పుడు. ఒకప్పుడు నేను చెప్పేవాణ్ని. ఇప్పుడు వైష్ణవ్‌ చెబుతున్నాడు.

* ముగ్గురిలో తెలివితేటలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి?

వైష్ణవ్‌ తేజ్‌: వరుణ్‌కి తెలివితేటలు ఎక్కువ.
వరుణ్‌తేజ్‌: నిజానికి తెలివితేటలు వైష్ణవ్‌కే ఎక్కువ. ఏదో కావాలని నా పేరు చెబుతున్నాడు.

* చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లో ఎవరెక్కువ ఇష్టం?

వరుణ్‌తేజ్‌: నేను, రామ్‌చరణ్‌ చిరంజీవి టీమ్. వైష్ణవ్‌ తేజ్‌, సాయితేజ్‌ పవన్‌ కల్యాణ్ టీమ్‌.

* మీ ముగ్గురూ కలసి వాట్సాప్‌ గ్రూప్‌ పెడితే ఏం పేరేం పెడతారు?

సాయిధరమ్‌ తేజ్‌: త్రీ మస్కిటియర్స్‌ అనే పేరు పెడతాం.

* ఎవరికి బద్ధకం ఎక్కువ?

వరుణ్‌తేజ్‌: నాకే బద్ధకం ఎక్కువ.

* చిన్నప్పుడు ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు?

వరుణ్‌తేజ్‌: సాయిధరమ్‌ తేజ్‌ బాగా అల్లరి చేసేవాడు. మేమిద్దరం ఒకే ఏజ్‌ గ్రూప్‌ కాబట్టి స్కూల్లో బాగా అల్లరి చేసేవాళ్లం. వైష్ణవ్‌ మా కంటే చిన్నోడు కదా.. సైలెంట్‌గా ఉండేవాడు.

* ఎప్పుడైనా అమ్మాయి విషయంలో ముగ్గురూ గొడవపడ్డారా?

సాయిధరమ్‌ తేజ్‌: ఆ దేవుడి దయ వల్ల ఇప్పటివరకైతే అలాంటి పరిస్థితి రాలేదు.

* ‘ఖుషి’ రీమేక్‌ చేస్తే మీలో ఎవరు సెట్‌ అవుతారు?

సాయిధరమ్‌ తేజ్‌: ఆ రోల్‌ చేయగలిగిన నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాత్రమే. ఇంకెవరికీ ఆ సినిమా సాధ్యం కాదు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus