కెరీర్ ప్రారంభించి తక్కువ రోజులే అయినా.. తనకుంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న కథానాయిక రష్మిక మందన. ఆమె తన సినిమాలతో ఎంతగా పాపులర్ అయ్యిందో, బయటి వ్యవహారాలు, చర్చల వల్ల కూడా అంతే పాపులర్ అయ్యింది. క్రష్మిక, పాన్ ఇండియా హీరోయిన్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి రష్మిక కోరికలేంటి? ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటోంది. ఈ వివరాలను ఆమే ఇటీవల వెల్లడించింది. ‘సీతారామం’ సినిమాలో అఫ్రీన్ పాత్రతో ఇటీవల ప్రేక్షకుల్ని అలరించిన రష్మిక.. తన మూడు కోరికల్ని బయటపెట్టింది.
కెరీర్‌లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటుందో చెప్పింది. ఏదైనా పీరియాడికల్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించాలనుందట రష్మికకి. అలాగే ఎవరిదైనా బయోపిక్‌లో ప్రధాన పాత్ర చేయాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇక స్పోర్ట్స్ నేపథ్య చిత్రాల్లోనూ కనిపించాలనుంది అని కూడా చెప్పింది. ‘డియర్ కామ్రెడ్’ క్రికెటర్‌గా కనిపించిన రష్మిక అదరగొట్టిందనే చెప్పాలి. దర్శకులు ఎవరైనా పై తరహా కథలు రాసుకుంటుంటే, మనసులో ఆలోచన ఉంటే రష్మిక పేరును కథానాయిక పాత్ర కోసం పరిశీలించొచ్చు.
అయితే వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు ఇలాంటి సినిమా అవకాశం వస్తే చేస్తుందా అంటే చూడాలి. ఇక రిస్క్ విషయంలో ఎప్పుడూ తగ్గేది లేదు అని కూడా చెప్పింది రష్మిక. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే అనుకుంటాను అని చెప్పింది రష్మిక. నటులు ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ఎంతో ముఖ్యం అని కూడా అంది. హిందీలో మీరు నటించిన ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా అని అడిగితే..
హిందీలోనే కాదు తెలుగులోనూ నాకు ఇలానే జరిగింది అని చెప్పింది రష్మిక. తన తొలి తెలుగు సినిమా ‘ఛలో’ చిత్రీకరణ దశలో ఉండగానే ‘గీత గోవిందం’, ‘దేవదాస్’ అవకాశాలు వచ్చాయి అని గుర్తు చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలానే జరుగుతోంది అని చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి అదృష్టంతోపాటు మంచి నటన కూడా కనబరిస్తేనే నటిగా ఎక్కువ రోజులు కొనసాగుతాం అని చెప్పింది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?