Rashmika: రష్మిక సినిమాలకు ఆ సెంటిమెంట్‌… చూస్తుంటే నిజమే అనిపిస్తోంది!

సినిమా వాళ్లకు సెంటిమెంట్‌లు చాలా ఎక్కువగా ఉంటాయి అంటారు. సినిమా కథ వినడం, ఓకే చెప్పడం, కొబ్టరికాయ కొట్టడం, పేరు రివీల్‌ చేయడం, పోస్టర్‌ రిలీజ్‌ చేయడం, ట్రైలర్‌ లాంచ్‌… ఆఖరికి గుమ్మడికాయ కొట్టడం వరకు ఇలా అన్నీ ముహూర్తాలు, నమ్మకాలు చూసే చేస్తుంటారు. ఇక రిలీజ్‌ డేట్‌ సంగతి సరేసరి. అయితే ఈ నమ్మకాలు హీరోలకు, నిర్మాతలకు బాగా కలిసొస్తుంటాయి కూడా. అలాంటిది ఈ నమ్మకం హీరోయిన్లకు కూడా ఉంటుందా? వాళ్లకు కూడా కలిసొస్తాయా? ఏమో రష్మిక మందన మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది.

రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. సెట్స్‌ మీద ఉన్న సినిమాలు ఓవైపు, చర్చల దశలో ఉన్న సినిమాలు మరోవైపు.. ఇలా క్రష్మిక బిజీగా ఉంది. అంతగా తనకు సినిమాలు అచ్చొస్తున్నాయి మరి. లేకపోతే ఇన్నేసి సినిమాలు, ఇన్నేసి ఇండస్ట్రీలు ఎక్కడ వీలవుతాయి చెప్పండి. అలాంటి రష్మిక ఇటీవల తన లక్కీ మంథ్‌ గురించి చెప్పింది. ఆ విషయం మన హీరోలు, నిర్మాతలు వింటే కచ్చితంగా ఆ నెలలో సినిమాల విడుదల కోసం సిద్ధమవుతారు అని చెప్పొచ్చు.

టాలీవుడ్‌లో తక్కువగా, బాలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలు అందుకుంటోంది రష్మిక. ఇటీవల ఆమె ఓ కార్యక్రమానికి హాజరై తనకు డిసెంబర్‌ నెల అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అంతేకాదు తనకు ఎందుకు అంత స్పెషల్ అనేది కూడా వివరించింది. డిసెంబరు నెల నాకెంతో సెంటిమెంట్. ఆ నెలను నా అదృష్టం అంతే. ఆమె నటించిన నాలుగు చిత్రాలు అదే నెలలో విడుదలై భారీ విజయాన్ని సాధించాయి అని లెక్కలు తీసి మరీ చెబుతోంది. రష్మిక (Rashmika) మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ (కన్నడ) డిసెంబర్‌లోనే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది.

ఇక పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’ కూడా ఆ నెలలోనే విడుదలైంది. బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌తో కలసి నటించిన ‘యానిమల్‌’ సినిమా 12వ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆ సినిమాకు హిట్‌ పక్కా అని ఫ్యాన్స్‌ లెక్కలేస్తున్నారు. సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా? బాలీవుడ్‌ బ్యాడ్‌ లక్‌ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఇక రష్మిక ప్రజెంట్‌ లైనప్‌ చూస్తే… సందీప్‌ వంగా దర్శకత్వంలో ‘యానిమల్‌’లో నటించింది. ‘పుష్ప 2’ సెట్స్‌ మీద ఉంది. ఇది కాకుండా ‘రెయిన్‌ బో’ అనే లేడి ఓరియంటెడ్‌ సినిమాలో చేస్తోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus