వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తే… మధ్యలో ఒక ప్రయోగాత్మక సినిమానో లేక యాక్టింగ్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉండే సినిమానో చేయకూడదా? చేయలేమా? అంటే… చాలామంది నటీమణులు ‘ఎందుకు చేయలేం.. కచ్చితంగా ’చేయొచ్చు అంటారు. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన మాత్రం ‘చేయలేం!’ అంటోంది. ఇదంతా ‘జెర్సీ’ సినిమా గురించి లెండి. ఆ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రష్మికను సంప్రదిస్తే ‘నో’ చెప్పిందట. అయితే ఇది హిందీ వెర్షన్ కోసం సుమా.
తెలుగులో మంచి విజయం అందుకున్న ‘జెర్సీ’ సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నప్పుడు హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందనను సంప్రదించారని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె అప్పుడు ‘నో’ చెప్పారని అన్నారు. తాజాగా దీనిపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. ‘నో’ చెప్పిన విషయం కరెక్టే అని, అయితే దానికో కారణం ఉందని చెప్పుకొచ్చింది రష్మిక. అయితే కారణం కాస్త విచిత్రంగా ఉండటం గమనార్హం. హిందీ ‘జెర్సీ’లో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే.
ఈ పాత్రను తొలుత రష్మిక మందనకు ఆఫర్ చేశారట దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అప్పుడు నో చెప్పిన రష్మిక ఇటీవల మాట్లాడుతూ… హిందీ ‘జెర్సీ’లో ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని చెప్పింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలే చేశాను. అలాంటిది ‘జెర్సీ’ లాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మనసులో తలెత్తడమే కారణం అని చెప్పింది. ‘‘జెర్సీ’ మంచి సినిమానే.. కానీ అది రియలిస్టిక్ చిత్రం. ‘జెర్సీ’ తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించింది.
ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ నటించలేరనేది నా ఉద్దేశం. అందుకే ఆ పాత్రకు నేను కరెక్ట్ కాదని అనిపించింది’’ అని చెప్పింది రష్మిక. అక్కడితో ఆగకుండా ‘‘అనుకుంటే నేను ఆ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శకనిర్మాతలు నష్టపోకూడదనుకున్నాను. ఆ సినిమా కోసం నాకంటే బెటర్ ఆప్షన్స్ టీమ్‌కి దొరుకుతుంది అని పించింది. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’’ అంది రష్మిక.అయినా కమర్షియల్ సినిమాలు చేసేవాళ్లు మధ్యలో రియలిస్టిక్ చిత్రం చేయలేరు, చేయకూడదు అని ఎవరన్నా అన్నారా? ఏమో మరి. రష్మిక అయితే అలానే అనుకుందట.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!