Rashmika: ‘గుడ్ బై’ కోసం రష్మిక క్రేజీ ప్రమోషన్స్!

కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టింది. ‘పుష్ప’ సినిమా ఈమె క్రేజ్ ను అమాంతం పెంచేసింది. దీంతో సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈమెకు గుర్తింపు లభించింది. దీంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇప్పటివరకు ఆమె నటించిన ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో రిలీజ్ కాలేదు.

కానీ ఆమె చేతిలో నాలుగైదు హిందీ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బాలీవుడ్ డెబ్యూ ఫిలిం ‘గుడ్ బై’ రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది రష్మిక. ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయలేదు రష్మిక. ఈ సినిమాలో ఆమెతో పాటు అమితాబ్ లాంటి స్టార్ హీరో కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు.

అందుకే ప్రమోషన్స్ బాధ్యత మొత్తం రష్మికపై పడింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకోవాలనుకుంటుంది. అందుకే వీలైనంత ఎక్కువగా ఈ సినిమా జనాలకు రీచ్ అవ్వడంతో తనవంతు సహకారం అందిస్తుంది. ఈవెంట్ లో స్కిన్ షో కూడా చేస్తుంది రష్మిక. ఎక్కువగా పొట్టి బట్టలతోనే కనిపిస్తుంది. మరి తను ఆశించినట్లుగా ఈ సినిమాతో హిట్ కొడుతుందేమో చూడాలి.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాను 2023లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు తెలుగులో ‘పుష్ప2’, ‘వారసుడు’ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే గనుక ఆమె రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం..!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus