Rashmika: అలా చేస్తే అందంగా కనిపిస్తారన్న రష్మిక.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక ఈ ఏడాది పుష్ప ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని పుష్ప2 మూవీ మేకర్స్ ప్రకటించడం గమనార్హం. రష్మిక తాజాగా అందం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

అందరం పనిలో పడి టైమ్ కూడా లేకుండా బిజీగా ఉన్న సమయంలో కనీస నిద్ర కూడా లేకపోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడం వల్ల కూడా చర్మం దెబ్బ తింటుందని రష్మిక కామెంట్లు చేశారు. అలాంటి సమస్యలు వచ్చిన సమయంలో చర్మ వ్యాధి నిపుణులను కలిసే సమయం కూడా ఉండదని ఆమె తెలిపారు. అలాంటి సమయంలో ఫేస్ మాస్క్ లు ధరిస్తే అందంగా కనిపిస్తారని రష్మిక పేర్కొన్నారు.

రష్మిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. రష్మిక రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం భారీ స్థాయిలో ఆఫర్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. రష్మిక త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా (Rashmika) రష్మిక క్రేజ్ ఆమెకు ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న రష్మిక భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus