Rashmika Marriage: పెళ్లిపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక!

తెలుగులో గోల్డెన్ లెగ్ గా పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరనే సంగతి తెలిసిందే. రష్మిక మందన్న నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్టయ్యాయి. ఒకవైపు మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోలకు జోడీగా రష్మిక నటిస్తున్నారు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులోనే రష్మికకు నటిగా ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ లో ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది.

Click Here To Watch

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు రష్మికకు ఉన్న క్రేజ్ వల్లే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమాతో ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు రష్మిక హిట్ ఇస్తారని జోరుగా వినిపిస్తోంది. అయితే తాజాగా రష్మిక ప్రేమ, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. తన దృష్టిలో ప్రేమను మాటల్లో వర్ణించలేమని ప్రేమ అనేది ఫీలింగ్స్ కు సంబంధించిన విషయం మాత్రమేనని రష్మిక కామెంట్లు చేశారు.

రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో గౌరవం, సమయం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలని రష్మిక చెప్పుకొచ్చారు. అలా ఉంటే మాత్రమే అది ప్రేమగా మారుతుందని రష్మిక వెల్లడించారు. రెండువైపుల నుంచి ప్రేమ ఉంటే మాత్రమే బంధం మరింత ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుందని రష్మిక వెల్లడించారు. తన వయస్సు చిన్న వయస్సు అని అందువల్ల తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని ఆమె అన్నారు. నా మనసులోకి పెళ్లికి సంబంధించిన ఆలోచనలను రానివ్వాలని భావించడం లేదని రష్మిక పేర్కొన్నారు.

రెండువైపులా ప్రేమ ఉంటే మాత్రమే బంధం ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుందని రష్మిక వెల్లడించారు. ప్రేమగా, సురక్షితంగా చూసుకునే వాళ్లను మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానని రష్మిక అన్నారు. బాలీవుడ్ లో రష్మిక చేతిలో మిస్టర్ మజ్ను, గుడ్ బై సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ లో కూడా రష్మికకు క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus