Rashmika: పుష్ప 2 శ్రీవల్లి ఫస్ట్ లుక్.. రష్మిక షాకింగ్ లుక్!

పుష్పలో అల్లు అర్జున్ కు జోడిగా నటిస్తున్న రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. రష్మిక ‘శ్రీవల్లి’ పాత్రలో కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆమె పాత్ర స్వభావం విబిన్నంగా కనిపిస్తోంది. పోస్టర్‌లో రష్మిక డి-గ్లామ్ లుక్‌తో కనిపిస్తున్నందున లుక్స్ పరంగా హావభావాలతో సరికొత్త స్టిల్ ఇచ్చింది. అల్లు అర్జున్ లుక్ తరహాలోనే రష్మిక కూడా పుష్ప కోసం డి-గ్లామ్ అవుతోంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప: ది రైజ్ ఈ క్రిస్మస్ థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ఐదు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా తీసుకుని సంగీతమందిస్తున్నాడు. పుష్ప ఆల్బమ్ నుండి రెండవ పాట కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇక ప్రస్తుతం సినిమా విడుదలకు పై అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ డిసెంబర్లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక రెండవ పార్ట్ షూటింగ్ కూడా దాదాపు 80 శాతం పూర్తయింది. పుష్ప 2ను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus