Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్
- September 3, 2026 / 05:40 PM ISTByFilmy Focus Desk
ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడి.. కోలుకొని మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆమె గత కొన్ని రోజులుగా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినిమాల బ్రేక్ రావడంతో ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నాను అని చెబుతూ/ రాస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు చేసిన పోస్టు ఇప్పటివరకు చేసినవాటికి భిన్నం అని చెప్పొచ్చు. ఇది వాళ్ల రిలేషన్ గురించి చెప్పకనే చెబుతోంది కూడా.
Rashmika
గాయం గురించి రష్మిక మందన తన పోస్టులో.. పెళ్లయిన తర్వాత నేను, విజయ్ మూడు నెలల పాటు ఒకరినొకరు చూసుకోలేదు. ఫోన్‌లోనే మాట్లాడుకునేవాళ్లం అంతే. అందుకేనేమో ‘కాస్త విశ్రాంతి ఇద్దాం. నిన్ను ఇంట్లోనే ఉంచుతా’ అని విశ్వమే ఇలా నాకు గాయం అయ్యేలా చేసిందేమో. పెళ్లయ్యాక మేమిద్దరం ఎక్కువ సమయం గడపడం ఇదే తొలిసారి. ఈ మాట వినడానికి వింతగా అనిపించినా.. నాకు ఈ సమయం చాలా నచ్చింది. ఇద్దరం కలసి ఇంట్లో ఆనందంగా గడిపాం అని రాసుకొచ్చింది రష్మిక.

విజయ్‌కు ఎక్కువగా సీరియస్ డ్రామాలు, షోలు ఇష్టం. నాకేమో కొరియన్ డ్రామాలు అంటే పిచ్చి. కానీ ఈ కొన్ని రోజులు మేమిద్దరం రెండూ చూశాం. ఆయనకు కె డ్రామాలు అలవాటు చేసేశా అని రష్మిక చెప్పింది. మనం ఇలా ఎన్నో రోజులు గడపాలి. కానీ, ఎలాంటి గాయాలు లేకుండా అంటూ విజయ్ జోక్స్ వేసేవాడని రష్మిక చెప్పింది. ‘మైసా’ సినిమా చిత్రీకరణ సమయంలో రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా తుంటి భాగంలో గాయమైంది. దీంతో కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి సెట్స్‌లో అడుగుపెడుతున్నారు.
రష్మిక తిరిగి సెట్స్‌లోకి వస్తుండటంతో ఆమె నటిస్తున్న రెండు సినిమాలు ‘మైసా’, ‘రణబాలి’ సినిమాల రిలీజ్ డేట్లను చిత్రబృందాలు ఇటీవల ప్రకటించాయి. మరి ఆ తేదీలను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.
















