Rashmika: అనిల్ రావిపూడి..ఎఫ్ 3 కి కూడా అదే సెంటిమెంట్!

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకి పెద్ద పీట వేస్తుంటారు. అభిమానులకి మాత్రమే కాదు దర్శక నిర్మాతలకి కూడా అదే రేంజ్లో సెంటిమెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్… కెరీర్ ప్రారంభం నుండీ ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు. పటాస్ నుండీ సరిలేరు నీకెవ్వరు వరకు అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఎఫ్3 కి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు.

మేటర్ లోకి వెళ్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘పటాస్’ లో శృతి సోది హీరోయిన్ గా నటించింది. ఈ భామని అనిల్ తన రెండో సినిమా ‘సుప్రీమ్’ లో కూడా ఓ పాటలో పెట్టుకున్నాడు. ఇక తరువాతి సినిమా ‘రాజా ది గ్రేట్’ లో .. ‘సుప్రీమ్’ హీరోయిన్ అయిన రాశీ ఖన్నా తో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించాడు. ‘ఎఫ్2’ లో రెండో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్…

అంతకు ముందు ‘రాజా ది గ్రేట్’ లో కూడా హీరోయిన్ గా నటించింది..! ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘ఎఫ్2’ హీరోయిన్ తమన్నా ఓ పాటలో డ్యాన్స్ చేసింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. సినిమాకి ఆ పాట ప్లస్ కూడా అయ్యింది. ప్రస్తుతం ఎఫ్3 లో కూడా సరిలేరు నీకెవ్వరు హీరోయిన్, నేషనల్ క్రష్ అయిన రష్మిక ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించనుంది.

ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం. ఈ ఒక్క పాట కోసం రష్మిక రూ.1 కోటి వరకు పారితోషికం అందుకోనుందని సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus