Rashmika Mandanna: హీరోయిన్‌ అంటే ఈ మాత్రం కష్టపడాలే..!

సన్నగా, నాజూకుగా నవనవలాడే హీరోయిన్‌ని చూడటం అంటే అందరికీ ఇష్టమే. అయితే దాని కోసం ఆ నాయికలు ఎంత కష్టపడతారో మీకు తెలుసా? మనలో చాలామంది రోజూ ఉదయాన్నే జిమ్‌కి వెళ్లాలి, వాకింగ్‌ వెళ్లాలి అనుకొని వాయిదా వేస్తుంటాం. కానీ వాళ్లు మాత్రం ఠంచనుగా కసరత్తులు చేస్తుంటారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి… మిగిలిన వాళ్లకు స్ఫూర్తిగా నిలిచే ప్రయత్నం చేస్తుంటారు.

తాజాగా ఇండియన్‌ క్రష్‌ రష్మిక మందన కూడా ఇదే పని చేసింది. తన బ్యూటిఫుల్‌ కర్వీ బాడీ వెనుక ఉన్న కసరత్తుల కష్టాన్ని సోషల్‌ మీడియాలో చూపించింది. జిమ్‌ ట్రైనర్‌ సమక్షంలో లెగ్‌ కిక్స్‌ ఇస్తూ కనిపించింది. కావాలంటే మీరూ దిగువ వీడియో చూడండి. రష్మిక కష్టం తెలుస్తుంది. అంతగా కష్టపడుతుంది కాబట్టే… బాడీని పర్‌ఫెక్ట్‌ షేప్‌లో ఉంచుకుంటూ వస్తోంది. హీరోయిన్లను ఫాలో అయ్యే అందరూ… ఈ టిప్స్‌ను కూడా ఫాలో అయితే బెటరేమో.

ఇక సినిమాల సంగతి చూస్తే… రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీల్లో నటిస్తోంది. అల్లు అర్జున్‌తో ‘పుష్ప’లో నటిస్తోంది. ఈ సినిమా తొలి పార్ట్‌ డిసెంబరు 17న విడుదల చేయబోతున్నారు. శర్వానంద్‌తో ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. ఇవి కాకుండా బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌బై’ సినిమాల్లోనూ నటిస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!


సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus