Rashmika: టాలీవుడ్ లో ఈ రికార్డ్ సృష్టించిన తొలి హీరోయిన్ గా రష్మిక!

కన్నడ చిత్ర పరిశ్రమకు కిరిక్ పార్టీ సినిమా ద్వారా పరిచయమయ్యి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న రష్మిక ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం వల్ల ఈమెకు రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించారు. రష్మిక ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 38 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగినటువంటి తొలి టాలీవుడ్ హీరోయిన్గా రష్మిక రికార్డు సృష్టించారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి సమంత ఇంస్టాగ్రామ్ లో 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా కాజల్ అగర్వాల్ 25.4, తమన్నా 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈ సీనియర్ హీరోయిన్ల కన్నా రష్మిక ఏకంగా 38 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడంతో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా ఈమె రికార్డ్ సృష్టించారు.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే నితిన్ సరసన మరొక సినిమా చేయబోతున్నారు. వీటితోపాటు రెయిన్ బో, రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus