‘వాళ్లు హీరోయిన్లు… సినిమా కోసం ఫిట్‌గా ఉండాలి… అందుకే జిమ్‌లో గంటలు తరబడి వ్యాయామాలు చేయాలి’ అనుకుంటుంటారు సాధారణ ప్రజలు. కానీ ఫిట్‌నెస్ కేవలం హీరోయిన్లకో, క్రీడాకారులకు కాదు అందరికీ ఉండాలి అంటూ కొణిదెల కోడలు ఉపాసన చెబుతున్నారు. దీని కోసం ఆమె ‘యువర్ లైఫ్’లో అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యువ కథానాయిక రష్మిక తన ఫిట్‌నెస్ మంత్రను వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
* వర్కౌట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వాటి వల్ల సంతోషంగా, ఉల్లాసంగా ఉండొచ్చు. నా వరకు అయితే వర్కౌట్స్ చేసి నా శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి.
* ఫిట్‌గా ఉన్నాననే నమ్మకం ఉంటేనే కెమెరా ముందు అందంగా కనిపిస్తాను. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం.
* ఫిట్ నెస్ అంటే నా దృష్టిలో మన పట్ల, మన శరీరం, మనసు పట్ల సంతోషంగా ఉండటం. ఈ సిద్ధాంతాన్ని నేను ఎప్పుడూ నమ్ముతా.
* నేనెప్పుడూ చేసే ప్రతి పనిలో ది బెస్ట్ ఉండాలని అనుకుంటూ. శారీరకంగా, మానసికంగా… దృఢంగా, ప్రశాంతంగా ఉండాలనేది నా లక్ష్యాల్లో ఒకటి. దాని కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధమే.
* నా వర్కౌట్ ఎప్పుడూ నేనున్న ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వీక్ బరువులు ఎత్తితే, మరో వారం కార్డియో చేస్తుంటా. ఎక్సర్‌సైజ్ చేయకపోతే అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.
* రోజూ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేసేలా నన్ను ముందుకు నడుపుతున్నది ఏంటో నాకే తెలీదు. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. ఆ ఇష్టమే నన్ను నడుపుతుందేమో.
* 50 ఏళ్ల వయసులోనూ వ్యాయామాన్ని కొనసాగిస్తా, స్ట్రాంగ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. వయసు పెరిగే కొద్దీ ఎక్సర్‌సైజ్‌కు శరీరం సహకరించకపోవచ్చు. నాకు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తునే ఉంటా.
* మహిళలు బరువులు ఎత్తకూడదని కొందరు అంటుంటారు. కానీ అదంతా నిజం కాదు. బరువులు ఎత్తడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. దాని వల్ల బరువు తగ్గడంతోపాటు, ఎముకలకు మేలు. శరీరం రంగు కూడా మెరుగుపడుతుంది.
* నాకు స్విమ్మింగ్ చేయడం, క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టం. ఈ మధ్య వాలీబాల్ ఆడటం మొదలుపెట్టా. బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నా.