Rashmika: గతంలో నిరాశలను వదిలి ముందుకు వెళ్ళు… రష్మిక పోస్ట్ వైరల్!

కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం భాషతో సంబంధం లేకుండా వరుస భాష సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా జీవిత పాఠాలను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సోషల్ మీడియా వేదికగా ఈమె (Rashmika) చేతిలో ఆకును పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె జీవిత సత్యాలను తెలియజేశారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. రష్మిక తన ఫోటోని షేర్ చేస్తూ… కోలుకో, నేర్చుకో, ఎదుగు, ప్రేమించు అంటూ నాలుగు పదాలు షేర్ చేసింది. ఆమె చెప్పింది ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.

అదేమంటే గతంలోని నిరాశలను వదిలి ముందుకు వెళ్లాలని, జీవితంలో ఎదురైన ప్రతి విషయం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలని, ఆ తర్వాత మంచి వ్యక్తులుగా ఎలా తయారవ్వాలో నేర్చుకోవాలని చెప్పుకొచ్చింది. ఇలా రష్మిక జీవితానికి సంబంధించి షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ యానిమల్ సినిమాలో కూడా ఈమె నటించారు.

అలాగే రెయిన్ బో సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ తో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమాలపరంగా రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus