Rashmika Mandanna: రష్మిక సక్సెస్ కావడానికి కారణం అతనేనా..?

Ad not loaded.

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్నాకు ఊహించని స్థాయిలో ప్రేక్షకుల్లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. మొదట్లో కన్నడ సినిమాలలో నటించిన రష్మిక ఛలో సినిమతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఛలో సినిమాలో ఛాన్స్ రావడం గురించి రష్మిక మాట్లాడుతూ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను కన్నడ సినిమాలలో నటిస్తున్న సమయంలో ఛలో సినిమా ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ కావడంతో ఈ ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి భయపడ్డానని రష్మిక అన్నారు.

ఆ సమయంలో నాన్న టాలీవుడ్ ఇండస్ట్రీ గ్రేట్ ఇండస్ట్రీ అని, మంచి ఇండస్ట్రీ అని చెప్పి తనతో ఛలో సినిమా చేయించారని రష్మిక తెలిపారు. టాలీవుడ్ లో ఈ స్థాయిలో గుర్తింపును సంపాదించుకోవడానికి నాన్నే కారణమని రష్మిక అన్నారు. మా నాన్న పేరు మదన్ అని ఆయన బిజినెస్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారని రష్మిక అన్నారు. చిన్నప్పుడు తాను హాస్టల్ లో ఉండి చదువుకోవడం వల్ల నాన్నతో తనకు అనుబంధం ఉండేది కాదని రష్మిక పేర్కొన్నారు.

అయితే తాను పెద్దయ్యాక తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైందని పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ నాన్న తనకు ప్రతి విషయంలో అండగా ఉండేవారని రష్మిక పేర్కొన్నారు. రష్మిక సక్సెస్ కు ఒక విధంగా ఆమె తండ్రే కారణమని చెప్పవచ్చు. రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus