Rashmika: వైరల్ అవుతున్న రష్మిక మందన్నా ఫోస్ట్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌, కన్నడ భామ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా యానిమల్‌. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా మారిన రష్మిక అండ్ రణ్‌బీర్ కపూర్. అయితే ఇప్పుడు రష్మిక తన అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తారల్లో రష్మిక ఒకరు. తన సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. తాజాగా జరిగిన ‘యానిమల్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ ఫొటోలు నాకెంతో నచ్చాయి. వీటిని ఇంత అందంగా తీసిన వారికి కృతజ్ఞతలు.

నిన్న ఈవెంట్లో మీ అందరి ప్రేమ, గౌరవం, నాపై ఉన్న అభిమానం.. ఇవన్ని కలిసి అద్భుతమైన క్షణాలను అందించాయి. హద్దులు లేని మీ అభిమానానికి ఎప్పుడూ నేను ఆశ్చర్యపోతుంటాను. ఇక తాజాగా జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రష్మిక తన స్వీట్ స్వీట్ వాయిస్‌తో మహేష్ బాబును పొగిడేసింది.

ఈ హిజ్ సో క్యూట్, సో స్వీట్, సో హ్యాండ్సమ్ అంటూ పొగిడేసింది. ఆమె అలా క్యూట్‌గా చెప్పడంతో మహేష్ బాబు నవ్వుతూ రష్మికను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, (Rashmika) రష్మిక, మహేష్ బాబు కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus