‘ఆచార్య’ (Acharya) అనేది చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఓ పెద్ద డిజాస్టర్ సినిమా. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు మాత్రం.. భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ఎందుకంటే అప్పటివరకు ప్లాప్ అంటూ లేని కొరటాల శివ (Koratala Siva) దీనికి దర్శకుడు కావడం. ఇంకోటి ఈ సినిమాలో రాంచరణ్ (Ram Charan) అతి ముఖ్యమైన పాత్రకి ఎంపికవ్వడం. అందుకే మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే మొదట పావుగంట అనుకున్న ఈ పాత్రని 45 నిమిషాలకు పెంచడం జరిగింది.
అందువల్ల చిరుకి హీరోయిన్ లేకపోవడం.. చరణ్ పాత్రకి హీరోయిన్ ను పెట్టాల్సి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. అందులో రష్మిక (Rashmika Mandanna) కూడా ఒకరు. చరణ్- రష్మిక అంటే మంచి పెయిర్. కానీ అప్పటికే ఆమె ‘పుష్ప’ (Pushpa) సినిమాలో ఎంపికవ్వడం వల్ల.. ఈ ప్రాజెక్టుని వదులుకోవాల్సి వచ్చింది.
సో మంచి పెయిర్ మిస్ అయినట్టే..! కానీ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. రష్మిక నేషనల్ క్రష్ అయ్యింది. కాబట్టి.. ఈ కాంబోలో సినిమా వస్తే మంచిదే కదా? ఆ లోటుని సుకుమార్ (Sukumar) తీర్చబోతున్నట్టు తెలుస్తుంది. అవును సుకుమార్.. తన నెక్స్ట్ సినిమాని చరణ్ తో చేయబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ గా రష్మికని ఫైనల్ చేసేసినట్టు ఇన్సైడ్ టాక్. మొన్నామధ్య కొత్త హీరోయిన్ల ఎంట్రీతో రష్మిక (Rashmika) పని అయిపోయింది అని అంత అనుకున్నారు. కానీ ‘యానిమల్’ ‘పుష్ప 2’ సినిమాలతో ఆమె మళ్ళీ పుంజుకుంది.