Rashmika: రష్మిక డైరీలో మరో తెలుగు సినిమా డేట్లు!

కన్నడలో చిన్న హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. తన చలాకీ తనంతో సౌత్‌ హీరోయిన్‌గా అనతికాలంలోనే మారిపోయింది రష్మిక మందన. వరుసగా కుర్ర స్టార్‌ హీరోలతో ఛాన్స్‌లు సంపాదించి.. స్టార్‌ హీరోయిన్‌ హోదా కూడా సంపాదించేసింది. సినిమా విజయాల సంగతి పక్కనపెట్టి మరీ ఆమెకు కుర్ర స్టార్ల సినిమాలు వచ్చాయి. ఆ వెంటనే బాలీవుడ్‌కి కూడా వెళ్లిపోయింది. దీంతో తిరిగి సౌత్‌ ఎప్పుడకొస్తుంది, ఇక్కడ సినిమాలు ఓకే చేస్తుందా అంటూ చిన్నపాటి చర్చ మొదలైంది.

దీనికి కొత్త సినిమా ఓకే చేసి కౌంటర్‌ ఇచ్చింది రష్మిక. రష్మిక మందన బాలీవుడ్‌లో ఇప్పుడు చేస్తోంది రెండు సినిమాలే కావొచ్చు. కానీ ఆమె పేరు మరికొన్ని సినిమాల విషయంలో పరిశీలనలో ఉంది అంటున్నారు. ‘గుడ్‌ బై’, ‘మిషన్‌ మజ్ను’ సినిమాలు చేస్తున్న రష్మిక ‘ఆషికీ 3’లో కూడా నటించనుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ‘పుష్ప2’ చేస్తున్న రష్మిక మరే కొత్త సినిమా ఓకే చేయలేదు. అయితే తమిళనాట మాత్రం సినిమాలు ఓకే చేస్తోంది.

విజయ్‌తో ‘వారిసు’ అనే సినిమా చేస్తున్న రష్మిక తాజాగా కార్తి సరసన నటించడానికి ఓకే చెప్పింది అంటున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో ‘జపాన్‌’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్‌ అధికారికంగా ప్రకటించకపోయినా.. కోలీవుడ్‌లో ఈ పేరుతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ సినిమా. అక్టోబరు తొలి వారంలో సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందట. ఇందులో నాయికగా రష్మికను ఖరారు చేసినట్లు సమాచారం.

కార్తి – రష్మిక – గతంలో ‘సుల్తాన్‌’ అనే సినిమాలో కలసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘జపాన్‌’ రెండో సినిమా అవుతుంది అన్నమాట. అంటే రష్మిక సౌత్‌ సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట. మరి తెలుగు దర్శకులు ఈ విషయంలో ఆలోచించి ఆమెను సంప్రదిస్తే ఓకే చెప్పే ఛాన్స్‌ ఉందన్నమాట. మరి రష్మిక నుండి నెక్స్ట్‌ తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్ ఏమవుతుంది అనేది చూడాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus