Rashmika: అట్టకెక్కిన రష్మిక మరో బాలీవుడ్ చిత్రం.. ఇబ్బందులలో నటి!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చి వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక మందన్న ప్రస్తుతం కెరియర్ పరంగా కాస్త ఇబ్బందులలోనే ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక తెలుగు తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తనని ఇబ్బందులలోకి పడేస్తున్నాయని తెలుస్తోంది

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు సినిమాలలో నటించిన ఈమెకు ఒక సినిమా కూడా మంచి సక్సెస్ అందించలేకపోయింది. ఇలా బాలీవుడ్ సినిమాలు సరైన సక్సెస్ అందుకోకపోయినా ఈమె మాత్రం బాలీవుడ్ సినిమాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈమెకు ఈ సినిమాలో అవకాశం రావడంతో తెలుగులో నితిన్ హీరోగా వెంకి కుడుముల డైరెక్షన్లో చేయాల్సిన సినిమా నుంచి తప్పుకున్నారు.

ఇలా బాలీవుడ్ సినిమా అలాగే నితిన్ సినిమా ఒకేసారి షూటింగ్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాక రష్మిక టాలీవుడ్ సినిమా కన్నా బాలీవుడ్ సినిమాకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆ సినిమాకే కమిట్ అయ్యారు. ఇక రష్మిక మందన్న వెంకీ కుడుమల కాంబోలో రావాల్సిన సినిమా నుంచి తప్పుకోవడంతో రష్మిక స్థానాన్ని నటి శ్రీ లీల ఆక్రమించారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా బడ్జెట్ సమస్యలు కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దీంతో రష్మికకు (Rashmika) భారీగా షాక్ తగిలింది అని చెప్పాలి ఈ సినిమా కోసం నితిన్ సినిమాను వదులుకుంటే ఇప్పుడు ఈ సినిమా కూడా షూటింగ్ ఆగిపోవడంతో రెండు సినిమా అవకాశాలను కోల్పోయినట్టు జరిగింది. ఈ విషయంపై నేటిజన్స్ స్పందిస్తూ అత్యాశకు పోతే ఇబ్బందులు తప్పవు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus