Rashmika: ఫేక్ యాడ్స్ తో మోసం చేస్తున్న రష్మిక.. ఏకి పారేస్తున్న నేటిజన్స్!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలో ఒకవైపు సినిమా చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇక రష్మిక మందన్న సైతం ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా ఇప్పటికే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నటువంటి రష్మిక ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ అడ్డంగా బుక్ అవడంతో నేటిజన్స్, అభిమానులు కూడా ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. మెక్‌డోనాల్డ్స్‌కు యాడ్ చేశారు. అందులో మెక్‌డోనాల్డ్స్‌ piri piri mcspicy చికెన్ బర్గర్‌ను ప్రమోట్ చేశారు.చాలా డిలీషియస్ గా ఉన్నటువంటి ఈ బర్గర్ను ఆమె తింటూ ఆస్వాదిస్తూ స్లో మోషన్ లో ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు.

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ రష్మికను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ఈ వీడియో పై స్పందించిన నెటిజెన్స్ రష్మిక ప్యూర్‌ వెజీ కదా.. నాన్‌ వెజ్ బర్గర్‌ తినడం ఏంటనే డౌట్ అందర్లో ఇన్‌స్టెంట్‌గా పుట్టేలా చేసి భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.అంతేకాకుండా గతంలో లాక్డౌన్ సమయంలో ఈమె ప్యూర్ వెజ్ అంటూ చెప్పిన ఒక వీడియోని కూడా దీనికి యాడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఫేక్ యాడ్స్‌తో.. తన ఫ్యాన్స్‌నే మోసం చేస్తోందంటూ.. (Rashmika) రష్మికను ఏకిపారేస్తున్నారు. సెలబ్రిటీస్‌ హిపోక్రసీకి రష్మిక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ. రష్మిక యాడ్ వీడియో పై చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా రష్మిక ఈ వీడియో కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటుందని చెప్పాలి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ తో పాటు ఇతర భాష సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus