ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. బాలీవుడ్ లో ‘యానిమల్’ (Animal) హిట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, సౌత్‌లో పుష్ప 2 (Pushpa 2: The Rule) కోసం ఎంతో కష్టపడింది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం రష్మిక ప్రతీ ఇండస్ట్రీలో ప్రత్యక్షమవుతూ, తన డెడికేషన్ ఏంటో చూపిస్తోంది. రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 170 రోజులు డేట్స్ ఇచ్చినట్టు టాక్.
Rashmika
హీరోయిన్స్ సాధారణంగా ఒక చిత్రానికి 100 రోజులకు అటు ఇటుగా డేట్స్ ఇస్తారు. కానీ, రష్మిక మాత్రం కథతో, పాత్రతో కనెక్ట్ అవుతూ రెండింతలు ఎక్కువ సమయం వెచ్చించింది. ఇది ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పడానికి సరైన ఉదాహరణ. తన కెరీర్ సక్సెస్ వెనుక ఆమె కృషి, పట్టుదలనే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రకు కీలక ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ సినిమా రష్మిక ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పడం విశేషం.
శ్రీవల్లి పాత్రలో ఉన్న ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. సినిమాలో రష్మిక నటన తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునేలా ఉంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. రష్మిక పనితీరుపై ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె ఎక్కడ పనిచేసినా, తన పనితనంతో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. పుష్ప 2 వంటి పెద్ద ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం వెచ్చించడం, ప్రమోషన్స్‌లో పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం ఆమె డెడికేషన్‌కు నిదర్శనం.
ఈ సినిమా సక్సెస్ సాధిస్తే, రష్మికకు మరిన్ని అవకాశాలు తలుపు తడతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రష్మిక పాన్ ఇండియా లెవెల్‌లో బిజీగా ఉంది. పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటే, ఆమె మార్కెట్ మరింత పాన్ వరల్డ్ స్థాయికి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మాత్రమే కాదు, రష్మిక కెరీర్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.