పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ‘వినోదయ సీతమ్’ రీమేక్ కు సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ మొదటి వారం నుండి అతను హరీష్ శంకర్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాడు. ఆ చిత్రం మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్లో పాల్గొంటాడు.
మరోపక్క ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. అదెప్పటికి కంప్లీట్ చేస్తాడో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా.. పవన్ (Pawan Kalyan) మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఆ యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు సుధీర్ వర్మ. ఇతను రవితేజతో ‘రావణాసుర’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏప్రిల్ 7న అది విడుదల కాబోతోంది. ఈ సినిమా పై పెద్ద బజ్ లేదు. అలాగే సుధీర్ వర్మ ఖాతాలో ‘స్వామి రారా’ తప్ప మరో హిట్టు సినిమా లేదు.
‘దోచేయ్’ ‘రణరంగం’ ‘శాకినీ డాకినీ’ ఇలా అతను తీసిన సినిమాలన్నీ ప్లాపులే. ‘కేశవ’ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. మరి ఇలాంటి దర్శకుడితో పవన్ కళ్యాణ్ ఎలా సినిమా చేస్తున్నాడు.. ఎలాంటి సినిమా చేస్తున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కచ్చితంగా రీమేక్ అయితేనే పవన్ యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తాడు. అలా అయితే ఏ సినిమాని పవన్ రీమేక్ చేయాలనుకుంటున్నాడు? దానికి త్రివిక్రమ్ కూడా రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తాడా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?