Ravanasura: ‘రావణాసుర’ నుండి లీక్డ్ వీడియో.. ఇంత దారుణంగా ఉందేంటి?

రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని గంటల ముందే ఈ చిత్రం నుండి ఓ సన్నివేశం లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ సీన్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సన్నివేశంలో రవితేజ ఆడవాళ్ళ గురించి చాలా ఘోరమైన డైలాగ్ చెప్పాడు. కాదు కాదు రవితేజ పోషించిన రావణాసుర పాత్ర చెప్పింది అనాలి. ‘కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి..

లేకపోతే నాకు మండుద్ది రా’ అంటూ క్రూరంగా అరుస్తుండగా.. ఎదురుగా ఉన్న హీరోయిన్ భయపడుతూ వస్తుంది. ఈ సినిమాలో (Ravanasura) మొత్తం 5 మంది హీరోయిన్లు నటించారు. వాళ్లలో మెయిన్ హీరోయిన్ ఎవరో ఎవ్వరికీ తెలీదు. మొదటి నుండి చిత్ర బృందం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది. సరే రావణాసుర అనేది నెగిటివ్ టైటిల్ కాబట్టి.. ఇలాంటి బోల్డ్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టే .. సెన్సార్ వారు ఈ చిత్రానికి ఎ రేటింగ్ ఇచ్చారు అని ఈ ఒక్క లీక్డ్ క్లిప్ తో స్పష్టమవుతుంది.

నిజానికి ఈ మధ్య కాలంలో మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఏదో ఒక రకంగా యు/ఎ రేటింగ్ తెచ్చుకుంటున్నారు. కానీ రావణాసుర కి మాత్రం ఎ రేటింగ్ కావాలని చిత్రబృందం తెచ్చుకుంది. ఈ సినిమాకి యు/ఎ కావాలంటే 44 కట్స్ చేయాలని సెన్సార్ టీం బృందం చెప్పిందట. వారు చెప్పినట్లు చేస్తే సినిమా ఒరిజినల్ ఫీల్ దెబ్బతింటుంది అని .. దానికి నో చెప్పి ఎ రేటింగ్ తెచ్చుకున్నట్టు నిర్మాత అభిషేక్ నామా చెప్పుకొచ్చారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags