Ravanasura Trailer Review: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ ఎలా ఉందంటే..!

(Ravanasura) ‘మాస్ మహారాజా’ రవితేజ వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ జెటో స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ మూవీస్‌తో సందడి చేశాడు.. ‘ధమాకా’ తో కెరీర్‌లో ఫస్ట్ టైం రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టాడు.. ప్రస్తుతం ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’ (బయోపిక్) చిత్రాలు చేతిలో ఉన్నాయి.. సుధీర్ వర్మ దర్శకత్వంలో, అభిషేక్ ఆర్ట్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల మీద రవితేజ – అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.. ఫస్ట్ టైం ఐదుగురు హీరోయిన్లతో నటిస్తున్నాడు మాస్ మహారాజా..

అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాశ్, దక్షా నగార్కర్ ఫీమేల్ లీడ్స్.. యంగ్ హీరో సుశాంత్ నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానున్న ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..రవితేజ పవర్ ఫుల్ లాయర్‌గా సేమ్ టైమ్ ప్రతినాయక ఛాయలున్న వ్యక్తిలా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు.. తన స్టైల్ కామెడీతో పాటు యాక్షన్‌తోనూ అలరించబోతున్నాడని ట్రైలర్ హింట్ ఇస్తుంది.. హీరోయిన్లతో రొమాన్స్ కూడా అదిరిపోయేలా ఉండబోతుందనిపిస్తుంది..

శ్రీరామ్, రావు రమేష్, జయరాం (మలయాళం), మురళీ శర్మ, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.. ‘వచ్చేటప్పుడు బయట నుండి డోర్ నాక్ చెయ్యాలి.. సరసాలాడేటప్పుడు లోపలనుండి లాక్ చేసుకోవాలండీ.. వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్.. మర్డర్ చెయ్యడం క్రైమ్, దొరక్కుండా మర్డర్ చెయ్యడం ఆర్ట్.. ఐయామ్ యాన్ ఆర్టిస్ట్, రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ.. ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడెవడైనా ఉన్నాడంటే.. అది నేనే’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి..

ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీకాంత్ విస్సా కథ, మాటలు, హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సెసిరోలియో సంగీతమందించగా.. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాడు.. ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus