గత కొంతకాలంగా “క్యాస్టింగ్ కౌచ్” అనే ఇష్యూ గురించి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. కొందరు పడుకుంటేనే ఆఫర్లు వస్తాయి అంటూ బల్లగుద్ది మరీ చెబితే.. ఇంకొందరేమో పడుకోవాల్సిన అవసరం లేదు అని నొక్కి వక్కాణించారు. ఈ రెండు వెర్షన్స్ లోనూ నిజం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. మొదటి ఆప్షన్ కి తలోగ్గాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం తప్పకుండా ఒప్పుకోవాల్సిన నిజం.
అయితే.. తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూపై భోజ్ పురి హీరో టర్నడ్ టాలీవుడ్ విలన్ రవికిషన్ కాస్త వైవిధ్యంగా స్పందించారు. “ఇండస్ట్రీలో దాదాపుగా అందరూ పడుకోమని అడిగేవాళ్లే ఉంటారు. అలాంటప్పుడు ధైర్యంగా తమను తాము అలాంటి సిచుయేషన్ నుంచి బయటపడేసుకోవాలే కానీ.. ఈజీ మనీ కోసం కక్కుర్తిపడి పడుకొంటే.. ఆ సమయంలో ఏమైనా ఏడుగుతారేమో కానీ భవిష్యత్ ఉండదు.
ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగితే పైకొస్తారు, ఆడే పడుకొని ఎదిగితే పైకి ఎడగలేరు” అంటూ చెప్పుకొచ్చాడు రవికిషన్. అసలు క్యాస్టింగ్ కౌచ్ అనేది అత్యధికంగా ఉండే భోజపురి ఇండస్ట్రీ నుంచి వచ్చిన రవికిషన్ ఇలాంటి వ్యాఖలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.