Ravanasura: ‘రావణాసుర’ లో అంత డీప్ ఇంటిమేట్ సీన్ ఉండటం వల్లే.. సెన్సార్ ఇబ్బందా?

రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది. రవితేజ ఇమేజ్ కు మ్యాచ్ కానీ సినిమా ఇది అని అంతా అంటున్నారు. అయినా అతని వరకు న్యాయం చేశాడు. పబ్లిసిటీ కోసమే ఇది రవితేజ సినిమా అని చెప్పుకోవాలి కానీ.. లాస్ట్ సీన్ వరకు కూడా రవితేజలో హీరోయిజం కనబడదు అంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి అనిపించుకోదు. అంతేకాదు చెప్పుకోడానికి ఈ సినిమాలో 5 మంది హీరోయిన్లు ఉన్నారు.

సినిమా చూసేవరకు ఇందులో హీరోయిన్ ఎవరు అనేది అర్థం కాదు. ఇప్పుడు చెప్పేస్తే సినిమా చూసే వాళ్ళ మూడ్ అప్సెట్ అవుతుంది కాబట్టి.. ఇక్కడ చెప్పడం లేదు. అయితే ఈ సినిమాలో రవితేజకి అలాగే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు మధ్య ఓ ఘాటైన ఇంటిమేట్ సన్నివేశం ఉంది. టాలీవుడ్లో ఇప్పటివరకు ఇంత నిడివి ఉన్న శృంగార సన్నివేశం ఏ సినిమాలోనూ పెట్టలేదేమో అనిపిస్తుంది. ఈ సన్నివేశం వచ్చిన ప్లేస్మెంట్ కూడా చాలా వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది.

ఓ పక్క పోలీస్ .. హీరో క్రుయాలిటీ గురించి చెప్తుంటే .. మధ్య మధ్యలో ఈ సన్నివేశం వస్తూ ఉంటుంది. కొంతకాలంగా రవితేజ తాను నటించే సినిమాల్లో హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు.. కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో దివ్యంశతో అలాగే, ‘ఖిలాడి’ లో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలతో..

లిప్ లాక్ లు, ఇంటిమేట్ సన్నివేశాలు వంటివి ఉన్నాయి. ‘రావణాసుర’ (Ravanasura) చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ అడిగితే సెన్సార్ వాళ్ళు 44 కట్స్ చెప్పారట. అందులో రవితేజ- అను ఇమ్మాన్యుయేల్ ల శృంగార సన్నివేశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే సినిమా ఫీల్ దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతో చిత్ర బృందం ‘ఎ’ సర్టిఫికెట్ తోనే సినిమా విడుదల చేసినట్లు తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus