Ravi Teja, Chiranjeevi: పోటీకి ఎవరొచ్చిన గెలిచేది అన్నయ్యనే… రవితేజ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ పరీక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైజాగ్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్ మహారాజ రవితేజ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా రవితేజ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి గారు నటించిన విజేత సినిమా విజయోత్సవాన్ని వేల మంది అభిమానుల మధ్య తాను కూడా ఒక అభిమానిగా చూసానని తెలిపారు. ఆ క్షణాన ఎప్పటికైనా చిరంజీవి గారి పక్కన కూర్చోవాలని అనుకున్నానని అప్పట్లో తన స్నేహితుల దగ్గర చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి పక్కన కాదు ఏకంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

వాల్తేరు వీరయ్య సినిమాలో అన్నయ్యతో కలిసి నటించిన ఆ క్షణాలు ఎప్పటికీ నా జీవితంలో గుర్తుండిపోతాయని రవితేజ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వేడుకతోనే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయని ఈ సంక్రాంతి పండుగకు ఎవరు పోటీకి వచ్చిన విజయం మాత్రం అన్నయ్యదే అంటూ రవితేజ వాల్తేరు వీరయ్య సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.

ఇక చిరంజీవి గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…వ్యక్తిగతంగా అన్నయ్య చాలా మంచి మనస్తత్వం కలవాడు ఎంతో మంది ఆయనను ఎన్నో మాటలు అన్న వాటిని భరిస్తూ మనసులోనే బాధపడతాడు తప్ప ఆ బాధను బయటకు తెలియజేయడు అంటూ చిరంజీవి గురించి ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus