Ravi Teja, Balakrishna: ‘అన్ స్టాపబుల్’లో మాస్ మహారాజా రచ్చ!

టాలీవుడ్ లో మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో ఆకట్టుకున్న రవితేజ ఇటీవలే ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేశారు. అలానే ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఆయన బాలయ్య టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో కనిపించబోతున్నారని సమాచారం. ‘ఆహా’లో టెలికాస్ట్ అవుతోన్న ఈ షోకి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి లాంటి స్టార్లు అతిథులుగా వచ్చారు. రీసెంట్ గా రాజమౌళి కూడా ఈ షోలో పాల్గొన్నారు. వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోలో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. త్వరలోనే మహేష్ బాబు ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రవితేజని గెస్ట్ గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి రవితేజ, బాలకృష్ణకి పడదని టాక్. అందుకే బయట కూడా వీరిద్దరూ కలిసి పెద్దగా కనిపించరని చెబుతుంటారు. దానికి కారణమేదైనా.. సరే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక షోలో కనిపిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కానుంది. రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోని బాలయ్య ఎలా ఇంటర్వ్యూ చేస్తారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షోకి రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రానున్నారట.

బాలయ్య నెక్స్ట్ సినిమాను డైరెక్టర్ చేసేది ఇతడే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus