Ravi Teja: టాలీవుడ్‌ రీమిక్స్‌ అయిన ఇళయరాజా మరో పాట.. ఈసారి నాశనం చేశారుగా!

  • March 16, 2023 / 11:15 AM IST

ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ఆటపట్టించాలంటే టాలీవుడ్‌లో చాలా పాటలే ఉన్నాయి. అలాంటి వాటిలో సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ లిస్ట్‌ రాస్తే ‘వెయ్యినొక్క జిల్లాల వరకు..’ అంటూ సాగే పాట తొలి స్థానాల్లో ఉంటుంది. ‘సూర్య ఐపీఎస్‌’ సినిమాలో విజయశాంతిని ఆటపట్టిస్తూ వెంకటేశ్‌ పాడుకున్న పాట ఇది. ఆ రోజుల్లో కుర్రకారు ఈ పాటను తెగ వాడేశారు. మీరు 90`s కిడ్‌ అయి ఉంటే మీరు కూడా వాడేసుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ పాటను ఇప్పుడు రీమేక్ చేశారు. ఇంకా చెప్పాలంటే రీమేక్‌ పేరుతో రకరకాలుగా చేశారు అని చెప్పాలి.

రవితేజ సినిమా పాటలు అంటే మినిమమ్‌ ఉంటాయి అంటుంటారు. అలాంటి రవితేజ నుండి ఓ రీమిక్స్ సాంగ్‌ వస్తోంది అంటే ఆ అంచనాలు బాగానే వచ్చాయి. ‘రావణాసుర’ సినిమా కోసం ‘వెయ్యినొక జిల్లాల వరకు..’ అనే పాట రీమిక్స్‌ చేస్తున్నాం అనే పోస్టర్ వచ్చేసరికి ఆసక్తికరంగా అనిపించింది. ప్రోమో అయితే కొత్తగా కనిపించింది. అయితే పాట వచ్చేసరికి మొత్తంగా తేడా కొట్టేసింది అని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఆ పాట రీమిక్స్ సరిగ్గా కుదరలేదు.

‘సూర్య ఐపీఎస్’ సినిమాలో పాట భలేగా ఉంటుంది. ఇళయరాజా బాణీ, సిరివెన్నెల సాహిత్యం, బాలు గానం అన్నీ కలిపి అదొక ఎవర్‌ గ్రీన్‌ సాంగ్‌. దీన్ని తీసుకునేటప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. అయితే ఇప్పుడు ‘రావణాసుర’లో పాట చూస్తే.. మ్యాజిక్‌ మిస్‌ అయ్యి డీజే మ్యూజిక్‌ వచ్చి యాడ్‌ అయ్యింది. అసలు ఒరిజినల్ ట్యూన్‌ని మార్చేసినట్లుగా అనిపించింది అంటున్నారు నెటిజన్లు. డీజే మిక్స్ చేయడంతో సాహిత్యం సరిగ్గా వినిపించలేదు అని అంటున్నారు.

శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ సినిమాను సుధీర్‌ వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రధారి. దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ సినిమాను ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus