‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా సగటు మాస్ సినిమాలా కాదు, ఇది కాస్త డిఫరెంట్ అని అంటోంది టీమ్. సినిమా ప్రారంభించిన తొలి నాళ్ల నుండి ఈ మాట వినిపిస్తూనే ఉంది. అయితే అంతలా ఏముంది అని అనుకున్న వాళ్లు ఉన్నారు. అంత సీన్ లేదు అని కామెంట్ చేసినవాళ్లూ ఉన్నారు. అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్ చూశాక టీమ్ చెప్పిందాంట్లో నిజం ఉంది అని నమ్ముతున్నారు. ఇక మరో విషయం చెప్పాలంటే కేవలం రెండే సీన్స్ విని రవితేజ ఈ సినిమా ఓకే చేసేశాడట.
‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను తాను ఎలా ఓకే చేశాను అనే విషయాన్ని (Ravi Teja) రవితేజ ఇటీవల ముంబయిలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ అంతా ఇటీవల ముంబయి వెళ్లి ఓ ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతుండట ఆనందంగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్ చెప్పా అంటూ రవితేజ చెప్పాడు.
అంతేకాదు దర్శకుడు వంశీ ఈ కథలోని రెండు సీన్స్ చెప్పగానే సినిమా కచ్చితంగా చేయాలనుకున్నాను అని కూడా చెప్పాడు రవితేజ. అంతలా ఆ రెండు సన్నివేశాల్లో ఏముంది, ఏం చెప్పారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు’ అనేది టైగర్ నాగేశ్వరరావు స్టైల్. ‘స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది కానీ, టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది’ అనేది సినిమా స్టైల్.
నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుకృతి వ్యాస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు ఈ సినిమా కోసం రవితేజ సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నారు. సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు ఆయనకున్న అనుభవంతో ఈ పని చేయగలిగారని టాక్.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !